Thursday, December 5, 2024
HomeతెలంగాణEturnagaram Encounter | ఎన్కౌంటర్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

Eturnagaram Encounter | ఎన్కౌంటర్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏటూరునాగారం ఎన్కౌంటర్ (Eturnagaram Encounter) పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. మృతదేహాలను రేపటి వరకు భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి (సోమవారానికి) వాయిదా వేసింది.

- Advertisement -

మూలుగుజిల్లా ఏటూరునాగారం (Eturnagaram) అడవుల్లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ (Encounter) లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ పై తెలంగాణ మానవహక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు వైద్య నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. పోస్టుమార్టం సమయంలో వీడియో రికార్డ్ చేయాలని కోరారు.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్న తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది ఆరోపించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టుకు వెల్లడించారు.

ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ… అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీసారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం మృతదేహాలను రేపటి వరకు భద్రపర్చాలని, కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News