Telangana Jagruthi New Presidents: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలమైన పాత్ర పోషించి, రాష్ట్ర ఆవిర్భావంలో అతిముఖ్యమైన పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి సంస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలకు సేవలు అందించేందుకు విదేశాల్లోనూ తమ కార్యకలాపాల్ని నిర్వహించాలని భావిస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రజల సమాజ అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ సంస్థ ఇకపై తమ కార్యకలాపాలను ప్రపంచ దేశాల్లో నిర్వహించనుంది. అందులో భాగంగానే వివిధ దేశాలకు నాయకత్వాన్ని సిద్ధం చేసుకుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకలాపాలను వేగంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కొత్త కార్యాలయం మొదలుపెట్టినప్పటి నుంచి చురుగ్గా ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన ప్రతి ఒక్కరికీ ఆమె తన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రపంచ దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు.. ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని, వారి సమస్యల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా నియమితులైన తెలంగాణ జాగృతి శాఖాధ్యక్షులు ఇలా ఉన్నారు:
న్యూజిలాండ్ – అరుణ జ్యోతి ముద్దం
గల్ఫ్ దేశాలు – చెల్లంశెట్టి హరిప్రసాద్
ఖతర్ – మూకల ప్రవీణలక్ష్మి (అధ్యక్షురాలు), నందిని అబ్బగోని (అడ్వైజర్)
యూఎఈ – పీచర వేంకటేశ్వర రావు (అధ్యక్షుడు), శేఖర్ గౌడ్ (ప్రధాన కార్యదర్శి)
కువైట్ – మర్క ప్రమోద్ కుమార్
సౌదీ అరేబియా – మహమ్మద్ మొజ్జం అలీ ఇఫ్తెకార్
ఒమన్ – గుండు రాజేందర్ నేత
యునైటెడ్ కింగ్‌డమ్ – సుమన్ రావు బల్మూరి
ఇటలీ – తానింకి కిశోర్ యాదవ్
ఫిన్లాండ్ – ఐరెడ్డి సందీప్ రెడ్డి
పోర్చుగల్ – ప్రకాశ్ పొన్నకంటి
మాల్టా – పింటు ఘోష్
కెన్యా – స్వప్న రెడ్డి గంట్ల
ఇరాక్ & కుర్దిస్తాన్ – మహ్మద్ సల్మాన్ ఖాన్ (అధ్యక్షుడు), నాయక్వార్ రాం చందర్ (ప్రధాన కార్యదర్శి)
ఇదే సమయంలో మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్ సుల్గే నియమితులయ్యారు.
ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని తెలంగాణ జాగృతి ప్రకటించింది. త్వరలోనే ఆయా దేశాల శాఖల పూర్తి కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అలాగే తెలంగాణలోనూ ఈ సంస్థ పటిష్టంగా ఎదిగేందుకు అవసరమైన కమిటీలు, నాయకత్వాన్ని కూడా విస్తరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


