Saturday, November 15, 2025
HomeతెలంగాణUrea News: గుడ్ న్యూస్: రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి శ్రీకారం..!

Urea News: గుడ్ న్యూస్: రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి శ్రీకారం..!

Good news on Urea: తెలంగాణలో రైతులకు యూరియా పంపిణీని మరింత వేగవంతం చేయడానికి, రద్దీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీని ప్రారంభించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు అగ్రికల్చర్ డైరెక్టర్ బి. గోపి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

కొత్తగా 500 రైతు వేదికల్లో పంపిణీ కేంద్రాలు:

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 12 వేల ప్రభుత్వ, ప్రైవేట్ యూరియా పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. అయితే, చాలామంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్ద కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ సమస్యను అధిగమించడానికి వ్యవసాయ శాఖ అదనంగా 500 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

పకడ్బందీగా పంపిణీ:

యూరియా పక్కదారి పట్టకుండా చూసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రైతు వేదికల వద్ద యూరియా పంపిణీని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉదయం నుంచే పలు జిల్లాల్లోని రైతు వేదికల ద్వారా రైతులకు యూరియా అందజేస్తున్నారు.

రైతులకు సౌలభ్యం కల్పించేలా చర్యలు:

యూరియా కోసం రైతులు గంటల తరబడి నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ ఆదేశాలను పాటించేలా అగ్రికల్చర్ డైరెక్టర్ బి. గోపి ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి మానిటరింగ్ చేస్తున్నారు.

ఈ సీజన్ వరకే రైతు వేదికల్లో యూరియా పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ చర్య ద్వారా రైతులు సులభంగా, వేగంగా యూరియాను పొందే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad