Today Rains in tg: తెలంగాణలో నేడు తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా నేడు ఇదే వాతావరణం కొనసాగుతుందన్నారు. అయితే ఈ ఆగస్టులో భారీ వర్షాలు కురుస్తాయని శుభవార్త చెప్పారు.
ఆగస్టు 5 నుండి భారీ వర్షాలు:
దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 5- 6 నుండి క్రమంగా తుఫానులు మొదలవుతాయని అన్నారు. ఆగస్టు 7 నుండి 15 వరకు – తీవ్రమైన ఉరుములు, దక్షిణ, పశ్చిమ, మధ్య తుపానులలో కొన్ని రోజులు భారీ నుండి చాలా భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
అప్రమత్తంగా ఉండాలి:
ఆగస్టు 15-23 – వరుసగా అల్పపీడన వ్యవస్థల కారణంగా, మొత్తం తుపానులో ఎక్కువ వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాలు నిరంతరంగా కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఆగస్టు 23 – సెప్టెంబర్ 1 కూడా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మొత్తానికి ఆగస్టు నెలలో వర్షాలు చురుగ్గా కొనసాగుతాయన్నారు. అయితే 1 లేదా 2 రోజుల విరామం ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.
గత కొన్ని రోజులుగా:
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మాన్ సూన్ వర్షాలకు బ్రేక్ పడింది. గత వారం ముసురు, మోస్తరు వర్షాలతో కూడిన వాతావరణం నిన్నటికి పూర్తిగా మారిపోయింది. నిన్న హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ అంతటా పొడి వాతావరణం కొనసాగింది. నేడు, రేపు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ప్రధానంగా ఈరోజంతా పొడి వాతావరణంతో ఉండి.. సాయంత్రం కొద్దిసేపు వర్షం పడుతుందన్నారు. ఇకపోతే నిన్నటి కంటే వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టీ.. రేపటి నుండి పూర్తిగా తగ్గుతాయన్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో వర్షపు లోటు కొంతవరకు తీరినా.. ఇంకా తీరాల్సిన అవసరం చాలా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అభిప్రాయ పడింది. ఇప్పటికీ రాష్ట్రంలోని వర్షపాతం మంచి స్థాయిలోనే ఉందని తెలిపింది. రాష్ట్రంలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాల కోసం మళ్ళీ ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే.


