తెలంగాణలో సంక్రాంతి సెలవుల(Sankranti Holidays)పై ప్రభుత్వం అధికార ప్రకటన చేసింది. ఈమేరకు సెలవుల తేదీలను ప్రకటించింది. జనవరి 11 నుంచి 17 వరకు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే జనవరి 11 నుంచి 16 వరకు జూనియర్ కాలేజీలకు హాలీడేస్ ఉంటాయని తెలిపింది.
- Advertisement -
పాఠశాలలు తిరిగి జనవరి 18న తెరుచుకోనుండగా.. కాలేజీలు జనవరి 17న తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా.. తాజాగా రెండు రోజులు ముందుగానే సెలవులు ప్రకటించింది.