తెలంగాణ సచివాలయ(Telangana Secretariat) ఉద్యోగుల సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అధ్యక్షుడిగా గిరి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్(జనరల్)గా నవీన్ కుమార్, మరో వైస్ ప్రెసిడెంట్‌గా(ఉమెన్) విజేత లావణ్య లత గెలుపొందారు.
- Advertisement -
ఇక జనరల్ సెక్రటరీగా ప్రేమ్, అడిషనల్ సెక్రెటరీగా రాము భూక్యా, జాయింట్ సెక్రెటరీ(పబ్లిసిటీ)గా రాజేశ్వర్, మరో జాయింట్ సెక్రటరీ(కల్చరల్)గా యామిని కనకతార, స్పోర్ట్స్ విభాగం జాయింట్ సెక్రటరీగా వంశీధర్ రెడ్డి, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా నీరజాక్షి, ఆర్గనైజేషన్ విభాగం నుంచి కే.శ్రీనివాస రెడ్డి విజయం సాధించారు. కాగా ఈ ఎన్నికలకు శనివారం జరిగిన పోలింగ్‌లో తమక ఓటు హక్కును సచివాలయం ఉద్యోగులు వినియోగించుకున్నారు.