Weather in Telangana Today: తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. హైదరాబాద్‌లో కూడా సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C మరియు కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా ఉండవచ్చు.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మరియు రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు.
నిన్న తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో సాధారణ జీవనం స్తంభించిపోయింది. రంగారెడ్డి జిల్లాలోని గునేగల్‌లో 179.5 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలో 178.8 మి.మీ. వర్షం కురిసింది.
నిన్న వర్షం కురిసిన ప్రాంతాలు:
రంగారెడ్డి జిల్లా: గునేగల్, హయత్‌నగర్, బండ్లగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాదర్‌గుల్, మెదక్, నిర్మల్ జిల్లా: కుబీర్, ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్, నల్గొండ: సింగరాజుపల్లె, నాగర్‌కర్నూల్: కిష్టంపల్లె, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా నేడు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


