Monday, November 17, 2025
HomeతెలంగాణRain Alert Telangana: తెలంగాణలో వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు

Rain Alert Telangana: తెలంగాణలో వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వాతావరణ వివరాలను(Weather Report)హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అలాగే రానున్న రెండు రోజుల్లో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొతతగూడెం, ఖమ్మం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ వంటి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఇక హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉంటుందని.. గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad