AP Judge| ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి ఎంపికయ్యారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి(Gayatri) ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయ్యారు.
- Advertisement -
జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమారై గాయత్రి వరంగల్‌లోని కాకతీయ వర్సిటీలో లా చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్‌లో నాలుగో ర్యాంక్ సాధించారు. తర్వాత ఎల్‌ఎల్‌ఎం కోర్సు ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు.
ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు. దీంతో గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు గాయత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.