బండి సంజయ్ ది అక్రమ అరెస్టు అంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేతలు. ప్రభుత్వం సంజయ్ పై కక్షపూరిత చర్యలకు దిగిందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఈమేరకు లోక్ సభ స్పీకర్ కు సైతం లేఖ రాశారు.
ఓవైపు టీఎస్పీఎస్సీ పరీక్షతో పాటు వరంగల్ లో టెన్త్ క్లాస్ హిందీ కొషన్ పేపర్ లీకేజీలోనూ బండి సంజయ్ పాత్ర ఉందంటూ టీఆర్ఎస్ సర్కారు ధ్వజమెత్తుతోంది. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ చేసిన వ్యక్తి బండికి సన్నిహితుడని అధికార పక్షం ఆరోపిస్తోంది.
నిన్న అర్ధరాత్రి నుంచి బండి సంజయ్ అరెస్టు హైడ్రామా కొనసాగుతోంది. పేపర్ లీకేజీలకు సంబంధించి బండిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కాగా మరికాసేపట్లో జరిగే ప్రెస్ మీట్ తో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో ఉన్న బండిని పోలీసులు ఉంచిన నేపథ్యంలో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ నేతలంతా సంజయ్ అరెస్టును ఖండిస్తుండగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి బండిని కలిసే ప్రయత్నం చేయగా ఆయన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.