అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు నల్లని బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. కేటీఆర్‌పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఫార్ములా ఈ-రేసుపై వాయిదా తీర్మానాన్ని అందజేశారు.
- Advertisement -
అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. ఓ వ్యక్తికి సంబంధించిన విషయాలపై సభలో చర్చ జరగదని.. రాష్ట్ర ప్రయోజనాల గురించి సభలో చర్చించాలని తెలిపారు. అయినా కానీ ఫార్ములా ఈ-కారు రేసు అంశంపై సభలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో వారంతా పేపర్లు చించి స్పీకర్ వైపు గాల్లో ఎగురవేస్తూ.. ప్లకార్టులతో వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభను 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు.