Thursday, November 21, 2024
HomeతెలంగాణTG High Court| బీఆర్ఎస్ మానుకోట ధర్నాకు హైకోర్టు అనుమతి

TG High Court| బీఆర్ఎస్ మానుకోట ధర్నాకు హైకోర్టు అనుమతి

TG High Court| కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల బాధితులకు సంఘీభావంగా మహబూబాబాద్(Mahabubabad) జిల్లా మానుకోటలో బీఆర్ఎస్(BRS) నిర్వహించాలనుకున్న మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మహాధర్నాకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మహాధర్నా కార్యక్రమం చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

కాగా లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు. అయితే చివరి నిమిషంలో ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన బీఆర్ఎస్ పెద్దలు.. హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 50వేల మందితో మహా ధర్నాకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News