Saturday, November 23, 2024
HomeతెలంగాణThalakondapalli: అట్టహాసంగా అంతరాష్ట్ర బండలాగు పోటీలు

Thalakondapalli: అట్టహాసంగా అంతరాష్ట్ర బండలాగు పోటీలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా..

తలకొండపల్లి మండల పరిధిలోని దేవుని పడకల్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అట్టహాసంగా జోడెద్దుల బండలాగు పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బండలాగు పోటీలు 1999లో లట్టుపల్లి వెంకట్ రెడ్డి ప్రారంబించారనీ స్థానికులు తెలిపారు. మండలంలోని పరిధిలోని దేవుని పడకల్ గ్రామంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన బండలాగుడు పోటీలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్‌, గ్రామ మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలంతో కలసి స్థానిక ఎస్సై ఎ శ్రీకాంత్ ఘనంగా ప్రారంభించారు. ఈ బండలాగు పోటీలలో అంతరాష్ట్ర వివిధ ప్రదేశాల నుండి 4 జోడెద్దుల జంటలు పాల్గొని ఎంతో బ్రహ్మాండంగా బండలాగుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

మొదటి జోడి డాక్టర్ అఖిలేష్ రెడ్డి యాదిరెడ్డి పల్లి గ్రామం, తాండూర్ మండలం,నాగర్‌కర్నూల్ జిల్లా వారు, రెండు మూడవ జోడిగా మడతల చంద్రహోబుల్ రెడ్డి చౌటపల్లి గ్రామం, పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారు, నాలుగవ జోడెద్దులు ఎమ్.గోపాల కృష్ణ పెద్దదగడ గ్రామం, చెన్నంబాయి మండలం వనపర్తి జిల్లాల వారు జోడెద్దుల బండలాగు పోటీలలో పాల్గొన్నారు. మొదటి మరియు ద్వితీయ బహుమతులు మడతల చంద్రహోబుల్ రెడ్డి వారు కైవసం చేసుకున్నారు. మొదటి బహుమతి 1,00,116₹ రెండవ బహుమతి 80,116₹ శతాబ్ది టౌన్‌షిప్ ఎండి కాసు శ్రీనివాస్ రెడ్డి వారి అందించారు. మూడవ బహుమతి డాక్టర్ అఖిలేష్ రెడ్డి జోడెద్దుల కైవసం చేసుకున్నారు.ఈ బహుమతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి 70,116₹ అందజేశారు.

నాలుగు బహుమతి ఎమ్.గోపాల కృష్ణ వారికి దక్కింది. నాలుగవ బహుమతిగా యస్.ఆర్ డెవలప్మెంట్ షాద్‌నగర్ వారు అందజేశారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్సై ఎ.శ్రీకాంత్, డోకూరి ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ…శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎండ్ల బండ పోటీలు గ్రామస్థులు సురక్షితంగా నిర్వహించుకోవాలన్నారు. శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు గ్రామస్థులు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్థులు చూసుకోవాలన్నారు.

ఆ స్వామి వారి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, వ్యవసాయ రంగంలో.. పాడి పరిశ్రమల రంగంలో.. వ్యాపారస్తులకు విద్యావంతులకు అన్ని రంగాలు అభివృద్ధి చెందేలే భగవంతుని ఆశిస్సులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి,మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం, ఎంపిటీసిలు, రఘు‌నాయక్, జోగు రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News