Saturday, May 18, 2024
HomeతెలంగాణThalakondapalli: ఇష్టారాజ్యాంగా ప్రైవేటు స్కూళ్ల దోపిడీ

Thalakondapalli: ఇష్టారాజ్యాంగా ప్రైవేటు స్కూళ్ల దోపిడీ

ఒంటి పూట బడి లేదు

తలకొండపల్లి మండలంలో ప్రవేట్ పాఠశాలల తీరు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల యజమాన్యాలు ప్రవర్తిస్తున్నట్లు ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్షిక సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో అధిక ఫీజులతో ప్రవేట్ పాఠశాలల యజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపుతూ వారిని వేదనకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫీజులు చెల్లిస్తేనే తప్ప తమ విద్యార్థులకు వార్షిక పరీక్షలు పెట్టబోమని హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితిలోనైనా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

- Advertisement -

తలకొండపల్లిలో లిటిల్ స్కాలర్, అక్షర, సాయిసహస్ర, వెల్జాల్‌లో విజేత ఇలా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను దూరం చేస్తూ, ప్రైవేటు పాఠశాలలలో బందీగా చేస్తున్నారు. ఎట్టకేలకు నియమ నిబంధనలతో కూడిన ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ, పేద ప్రజలకు అందని రీతిలో ప్రైవేటు యాజమాన్యం తయారవుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ నియమాలతో ఏర్పడిన ప్రైవేటు పాఠశాలలలో ఇష్టారాజ్యంగా యాజమాన్యం వ్యవహరిస్తూ తాము చెప్పిందే వేదంగా‌ కొనసాగుతున్నాయి.

విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం నామమాత్రంగా పర్యవేక్షణ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, ఆమన‌గల్, కడ్తాల్, మాడ్గుల్ మండలానికి ఒక్కరే ఎంఈఓగా ఉండడంతో కొంత ప్రైవేటు పాఠశాలలో పర్యవేక్షణలో అంతరాయం కలుగుతుందనే భవన ఉంది. వేసవి కాలం సమీపించిన నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఎండలు ఉండండం వలన మద్యాహ్నం వరకు మాత్రమే పాఠశాలలు నడిపేలా ప్రభుత్వం సూచించింది. ఇలా ప్రభుత్వం సూచించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు సాయంత్రం 4 గంటలకు వరకూ నడుపుతున్న తీరును మండలంలో ప్రైవేట్ పాఠశాలలో కనిపిస్తోంది. తీవ్రమైన ఎండలో విద్యార్థులు అనేకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

ఫీజులు కట్టని విద్యార్థులను క్లాస్ రూం బయట నిలబెట్టి, అవమాన పరుస్తున్న తీరు తల్లిదండ్రులను ఆవేదనకు గురిచేస్తోంది. అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల తీరును అధికారులు కట్టడి చేయాలని ఆయా గ్రామాల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News