Saturday, October 5, 2024
HomeతెలంగాణThalakondapalli: రాజీమార్గమే రాజమార్గం

Thalakondapalli: రాజీమార్గమే రాజమార్గం

వ్యక్తిగత కేసులను లోక్ ఆదాలత్ లో పరిష్కారం చేసుకోండి

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు ఎంతో అవసరమైనదనీ కక్షిదారుల పరస్పర సమ్మతితో కేసులను పరిష్కరించే విధంగా లోక్ అదాలత్ సేవలు ఉంటాయని తలకొండపల్లి ఎస్సై ఎ శ్రీకాంత్ అన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్న నేపథ్యంలో తలకొండపల్లి ఠాణాలో 260 కేసులు నమోదైనట్లు ఎస్సై ఏ. శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆమనగల్ కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్ సేవలు 260 కేసులలో సోమవారం 9కేసులు రాజీ పడ్డట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షణికావేశంలో పరస్పర గొడవలు పడి ఇరువురి మధ్య కేసులు నమోదు చేసుకొని ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి లోక్ అదాలత్ సేవలు ఎంతో ముఖ్యమన్నారు.

- Advertisement -

వ్యక్తిగత విమర్శలతో కేసులు పెట్టుకున్న వారు లోక్ అదాలత్ లో తమ కేసులను రాజీపడి పరిష్కరించుకోవాలని రాజీమార్గమే రాజమార్గమని ఆయన తెలిపారు. లోక్ అదాలత్ సేవలు ఈ నెల 16 వరకు నడుస్తుందని, అవసరమైన వారు కేసులు పరిష్కారం చేసుకోవాలని ఎస్సై సూచించారు. తలకొండపల్లిలో 260 కేసులు లోక్ అదాలత్ లో ఉన్నట్లు తెలిపారు. సోమవారం తొమ్మిది కేసులు రాజిపడ్డట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే తమతమ కేసులను రాజీ పడి ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా ఉండాలని తలకొండపల్లి మండల ప్రజలకు ఎస్సై సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News