తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసం వద్ద నియోజకవర్గ పరిధిలోని 100 మంది బిసి కులవృత్తిదారులకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులకు చేయూతను అందించాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ అధికారి ఆశన్న, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీబాల్ రెడ్డి, మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప పాల్గొన్నారు.