Sunday, July 7, 2024
HomeతెలంగాణThalasani: నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయం

Thalasani: నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయం

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు

నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లో రూ.55.50 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముందుగా శ్రీరాం నగర్ లో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్,రూ.16 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్,బస్టాండ్ సమీపంలో గల జిమ్ వద్ద రూ.24.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం సాయిబాబా నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన మంత్రి వెంటనే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఓరిగిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేయాలని కోరారు. దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరగా, పనులు త్వరలో చేపడతారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కంజర్ల లక్ష్మీనారాయణ పార్క్ నుండి బల్కంపేట రోడ్డు వరకు రొడ్డి అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.

- Advertisement -

ఈ రోడ్డుపై ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి,వాటర్, డ్రైనేజీ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. సాయిబాబా నగర్ లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నెల రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి,సాయిబాబా నగర్ అధ్యక్షుడు అర్జున్ పటేల్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిసి మోహన్ రెడ్డి, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ జిఎం హరి శంకర్, స్ట్రీట్ లైట్ ఈఈ ఇంద్రదీప్, హార్టికల్చర్ అధికారి జ్యోత్స్న, తహసీల్దార్ విష్ణు సాగర్, ఎఎంఓహెచ్ భార్గవ్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఖలీల్, నాయకులు ప్రవీణ్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,రమేష్ గౌడ్, సీనియర్ సిటిజన్ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News