భారతీయులు జరుపుకునే ప్రతి పండుగకు విశిష్టత ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందిరా పార్కులో నిర్వహించిన హోలీ వేడుకలకు ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. మన పండుగలన్నీ ఎంతో శాస్త్రీయమైనవన్నారు. వసంత రుతువుకు ఆహ్వానం పలుకుతూ జరుపుకునే రంగుల పండుగనే హోలీ అన్నారు.
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని చెప్పారు. పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాల్లోని శాస్త్రీయతను ప్రతిబింబిస్తాయన్నారు. నేటి యువత చాలా మందికి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల పట్ల కనీస అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. వాటిని వారికి తెలియజేసి అలవరచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సంప్రదాయాల పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. మన ఆచారాలను మరచిపోవడం బాధాకరమని తెలిపారు. విదేశీ కల్చర్ ను బహిష్కరించాలని సూచించారు.