అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలోని గ్రామ కమిటి, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్, తంగళ్ళపల్లి మహిళా మండల అధ్యక్షురాలు కోడం భవిత, బిజెపి నాయకురాలు ఆసాని లావణ్య లింగారెడ్డి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ మహిళా సిబ్బందికి, ఏఎన్ఎమ్ లకు, ఆశ వర్కర్లకు, అంగన్వాడీ టీచర్ కు తదితర విభాగాలలో పనిచేస్తున్న మహిళలందరినీ శాలువాతో ఘనంగా సత్కరించి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుర్తింపుగా మెమెంటోని అందించారు. వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కలికోట కాళీ చరణ్, మంచు కట్ల ప్రసాద్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చర్లపల్లి రవి గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జంగం కిషన్, జూకంటి అఖిల్, బోయ రాజుగారు తోట రాజు, కన్నె అరుణ్, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.