Sunday, November 16, 2025
HomeతెలంగాణThangallapalli: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా సత్తు శ్రీనివాస్ రెడ్డి నియామకం

Thangallapalli: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా సత్తు శ్రీనివాస్ రెడ్డి నియామకం

నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సత్తు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి (సెక్రటరీ) గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని సత్తు శ్రీనివాస్ రెడ్డికి ఆయన అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమకమైన సందర్భంగా సత్తు శ్రీనివాస్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

అనంతరం ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృధ్దికి కృషి చేయాలని ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి తెలిపారని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి, తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ, కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్య శివ ప్రసాద్, సీనియర్ నాయకులు పూర్మని రాంలింగారెడ్డి, గోనె ఎల్లప్ప, గుగ్గిల భరత్ గౌడ్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad