Tuesday, September 17, 2024
HomeతెలంగాణHyderabad Crime : దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ.. పోలీసులు ఏమన్నారంటే..

Hyderabad Crime : దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ.. పోలీసులు ఏమన్నారంటే..

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీని చేధించారు పోలీసులు. డిసెంబర్ 15వ తేదీన మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పదేళ్ల ఏళ్ల చిన్నారి మిస్సింగ్ ఘటన సంచలనంగా మారింది. 16న చిన్నారి ఇందు మృతదేహం దమ్మాయిగూడ చెరువులో లభ్యమైంది. మృతదేహాన్ని చెరువులోనుండి తీశాక తల్లిదండ్రులకు చూపించకుండగానే పోస్టుమార్టమ్ కు తరలించడంపై అనుమానాలు వ్యక్తమయ్యారు. దాంతో తమకు న్యాయం చేయాలంటూ ఇందు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా అభ్యర్థించారు.

- Advertisement -

గంజాయి బ్యాచ్‌ తమ పాపను ఏదైనా చేయకూడనిది చేసి దమ్మాయిగూడ చెరువులో పడేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో.. పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేశారు. టాయిలెట్ కోసం చెరువు వద్దకు వెళ్లిన చిన్నారి.. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయినట్లు తేల్చారు. ఆడుకోవటానికి వచ్చిన ఇందు చెరువు వద్దకు వెళ్లడంతో ఈ దుర్ఘటన జరిందని చెప్పారు. గాంధీ ఫోరెన్సిక్ టీం పోస్ట్ మార్టం నేవేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివరాలు వెల్లడించారు. ఇందు పోస్టుమార్టమ్ రిపోర్టులో.. ఆమె ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లడంతోనే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. చిన్నారిపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News