కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు చెన్నబోయిన రవిని వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కానుండగా తిమ్మాపూర్ నుంచి రవి పేరు పరిశీలనలోనున్నట్లు తెలుస్తోంది. మరోసారి తిమ్మాపూర్ మండలానికి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ పదవి తిమ్మాపూర్ మండలానికి దక్కగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరోసారి అవకాశం వచ్చింది.
బీసీ జనరల్ అయ్యే ఛాన్స్
ఆనాడు ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించగా ప్రస్తుతం బీసీ జనరల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని కాపాడుకుంటూ ప్రజల్లోకి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ లో ఉండి గెలిచిన నాయకులంతా ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమణా రెడ్డి సహకారంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రవి ఎంతగానో కష్టపడ్డాడు. కవ్వంపల్లి గెలుపులోనూ.. మానకొండూర్ ఎమ్మెల్యేగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపులోనూ చెన్నబోయిన రవి కీలకపాత్ర పోషించినట్లు స్వయంగా ఎమ్మెల్యే నే ప్రకటించడంతో పార్టీకి రవి చేసిన సేవ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆశీస్సులు ఆయనకే..
ఎమ్మెల్యే కవ్వంపల్లి, మండల అధ్యక్షుడు రమణా రెడ్డి ఆశీస్సులు ఎక్కువగా ఉండడంతో రవికి చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మండలంలో జోరుగా చర్చ సాగుతోంది. యూత్ లో పెరిగిన నమ్మకం.. చెన్నబోయిన రవికి చైర్మన్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తుండడంతో పార్టీలోని మరికొంత మంది యువకులకు నమ్మకం పెరిగింది. పార్టీకి విధేయుడుగా పనిచేసే వారికి తప్పక అవకాశం ఉంటుందనే భావన వారిలో కలుగుతోంది. కాగా కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పటికీ యూత్ లీడర్ కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.