Monday, June 23, 2025
HomeతెలంగాణThimmapur: ఆ ఎమ్మెల్యేకు అసలేం జరిగింది ?

Thimmapur: ఆ ఎమ్మెల్యేకు అసలేం జరిగింది ?

మానకొండూర్ ఎమ్మెల్యే కు గుండెపోటు అంటూ ప్రచారం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో వార్త కథనాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యేకు గుండెపోటు వచ్చిందనీ, అతనికి శస్త్ర చికిత్స చేసి స్టెంట్ వేశారంటూ ఓ యాప్ లో వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఎలా ఉన్నాడంటూ ఎమ్మెల్యే కార్యాలయంలోని సిబ్బందితో పాటు పలువురు ముఖ్య నాయకులకు ఫోన్లు వచ్చాయి. ఆ నోటా.. ఈ నోటా.. విషయం ఎమ్మెల్యే దాకా చేరగా, తాను బాగానే ఉన్నానంటూ హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. కాగా ఎమ్మెల్యేకు స్టెంట్ పడిన మాట నిజమా? కాదా? అంటూ నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News