Thursday, September 19, 2024
HomeతెలంగాణThorruru: హనుమాన్ జయంతి వేడుకలు, శోభాయాత్ర

Thorruru: హనుమాన్ జయంతి వేడుకలు, శోభాయాత్ర

తన, మన, పర అనే తేడాలు లేకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించడమే కాకుండా పరమత సహనాన్ని, మన మత గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనమంతా మెలగాలి అన్ని మతాల సారాంశం ఒక్కటే మానవత్వం, మానవత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచానికి మంచి చేసే విధంగా రాజకీయాలకతీతంగా భక్తి భావాన్ని పెంచి పోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరి పైన ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ దళ్, స్థానిక హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలకు మంత్రి ఎర్రబెల్లిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రలో మంత్రి పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సర్వ మతాల సారాంశం ఒక్కటే. దేవుడు ఒక్కడే. ప్రతి మనిషిని సమానంగా గౌరవించాలన్నదే ఆయా మతాల విధానం. అదే సమున్నత మానవత్వం. ఆ మానవీయతను ప్రపంచానికి చాటాలని చెప్పారు. మన మత గౌరవాన్ని నిలుపుకోవాలంటే పరమత సహనాన్ని పాటించాలని సూచించారు. దైవభక్తి సమాజంలో ప్రశాంతతను చాటుతుందని, అందుకే రాజకీయాలకతీతంగా ప్రజల్లో భక్తి భావాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందని మంత్రి అన్నారు.

అయోధ్య, భద్రాద్రికి ఉన్నంత చరిత్ర పాలకుర్తికి ఉందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మీడి గ్రామంలో రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మునుల గుట్టపై తపస్సు చేసుకున్నాడని, ఆ పక్కనే ఉన్న మరో గుట్టపై నుంచి రాముడు నడయాడాడని చరిత్ర చెబుతో 0దని, ఆ చరిత్రను వైభవాన్ని నిలిపేందుకు తాను సీఎం కేసిఆర్ గారి ఆశీస్సులతో ఆనాటి పురాతన రామాలయాన్ని పునర్ నిర్మిస్తున్నామని, ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఆదికవి సోమనాథుడి స్వగ్రామం పాలకుర్తి లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు దేవాలయ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అలాగే ఆ పక్కనే ఉన్న సహజకవి, భాగవత రచయిత పోతన పుట్టిన, బమ్మెర గ్రామాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని అక్కడ రామాలయం తో పాటు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాసర తరహా అక్షరాభ్యాస కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి ఎర్రవెల్లి వివరించారు. నియోజకవర్గంలోని అనేక పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తూ, జీర్ణోద్ధరణ చేస్తూ పూర్వవైభవాన్ని తేవడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఈ విధంగా పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ఇక్కడి ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

సిద్ధ యోగి శ్రీ స్వామి చైతన్య ఆనంద మాట్లాడుతూ, హనుమంతుడు ధైర్యం, సాహసానికి ప్రతీక, రాముడు గుణగణాల లో గొప్పవాడు. ఈ రెండు లక్షణాలను ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాలి. అలవరచుకోవాలి. అప్పుడే దేశంలో రామరాజ్యం వస్తుంది. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారని చెప్పారు. పరమత సహనాన్ని పాటిస్తూ, గౌరవిస్తూ, హిందూమత గొప్పదనం ను ప్రపంచానికి చాటాలని అన్నారు.

భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, స్థానిక హనుమాన్ దేవాలయ కమిటీ ల అధ్వర్యంలో వీర హనుమాన్ శోభా యాత్ర తొర్రూరు లో పాటి మీద ఆంజనేయ స్వామి దేవాలయం నుండి దుబ్బ తండా హనుమాన్ గుడి మీదుగా, పాల కేంద్రం హనుమాన్ గుడి వరకు కొనసాగింది.

ఈ కార్యక్రమంలో శోభాయాత్ర కన్వీనర్ కొల్పుల శంకర్, కో కన్వీనర్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్, భరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, శివరాం లతో పాటు వందేమాతరం ఫౌండేషన్ తక్కళ్ళ పల్లి రవీందర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, హనుమాన్ భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News