వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల రెవెన్యూ పరిధిలోని సర్వె నెంబర్ 195లో ఆర్ &బి కాలని గ్రామ పంచాయతీ పరిధిలోని వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారి మొరిపిరాల కమన్ ఎదురుగా ఉన్న సన్నూరు వేళ్ళే దారిలో వెంచర్ ను ఏర్పాటు చేసి అమాయక ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తున్నారు. వ్యవసాయ భూములను ఎకరాకు 50లక్షల నుండి 60లక్షల వరకు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా ఫాం ల్యాండ్ వెంచర్ లు గా మార్చి గజానికి 6 వేల పైచిలుకు వరకు అమ్మకాలు జరుపుతూ వెంచర్ నిర్వాహకులు అడ్డదారిలో కోట్ల రూపాయలు గడిస్తున్నారు.” ఫాం ల్యాండ్ పేరుతో ఘరానా మోసం” అనే కథనాన్ని”శుక్రవారం” రోజున తెలుగు “ప్రభ వెబ్ సైట్ లో “ప్రచురించడం జరిగింది. పత్రికలో ప్రచురించినప్పటికి పంచాయతీ కార్యదర్శి వెంచర్ లో హద్దు రాళ్ళను తోలగించకుండా నోటీసు బోర్డు ఏర్పాటు చేశామని చెబుతు చేతులు దులుపుకుంటున్నారు..ఏదేమైనప్పటికి ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందేననీ పలువురు బాహాటంగానే చెబుతున్నారు.
8ఎకరాల్లో..100సంఖ్యలో ప్లాట్లు:
రాయపర్తి మండలం మొరిపిరాల రెవెన్యూ పరిధిలో గల సర్వేనెంబర్ 195 లో సుమారు 8ఎకరాల భూమిలో ఫాం ల్యాంఢ్ పేరిట ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత మూడు సంవత్సరాల కాలంగా జరుగుతున్న ఈ భూదందాలో పేద ప్రజలే అత్యధికంగా మోసపోతున్నారు. ఫాం ల్యాండ్ లో వివిధ రకాల పండ్ల, వాణిజ్య మొక్కల పెంపకం జరుగుతుందని,10ఏళ్ళలో భూమి విలువ పేరగడంతో పాటు వాణిజ్య మొక్కల పెంపకం తో రెట్టింపు ఆదాయం వస్తుందని అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. రెండు గుంటలకు మొదలు కోని మూడు నాలుగు గుంటల వరకు ప్లాట్లు చేసి విక్రయాలు జరుపుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ప్లాట్ల అమ్మకం పూర్తయ్యాయి. అప్పట్లో తహశీల్దార్ గా కొనసాగిన సత్యనారాయణ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసి పాస్ బుక్ లు జారి చేసినట్లు తెలుస్తోంది..ఫాం ల్యాండ్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకోని వందల సంఖ్యలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం….
బై/1/1/,A నెంబర్ లతో రిజిస్ట్రేషన్ లు :
195సర్వే నెంబర్ లో /1/2/A,అనే సబ్ నెంబర్ లతో ఈ ఒక్క సర్వే నెంబర్ లో 35పై చిలుకు బై నెంబర్ లు ఇస్తు రిజిస్ట్రేషన్ లు చేసి పాస్ బుక్ లు జారీ చేయడం గమనార్హం..ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫాం ల్యాండ్ 5 గుంటల పైచిలుకు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయ్యాలి. కానీ ఫాం ల్యాండ్ నిర్వహకులు అధికారులకు డబ్బు ఆశా చూపి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కోడుతున్నారు.
ఉన్నతాధికారులు ఫాం ల్యాండ్ పై చర్యలు తిసుకునేదేప్పుడు:
నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఫాం ల్యాండ్ పై చర్యలు తీసుకోవడంలో ఎంపివో స్థానిక పంచాయతీ కార్యదర్శి విఫలమయ్యారని చేప్పుకోవచ్చు. ఫాం ల్యాండ్ నిర్వహకునికి పంచాయతీ కార్యదర్శి అండదండలు పుష్కలంగా ఉన్నయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నోటీసులు జారీ చేశామని చెబుతూ హద్దు రాళ్ళను తొలగించకుండా కాలయాపన చేస్తున్నరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికి సంబంధిత అధికారులు అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.