నిర్మల్ జిల్లా ఖానాపూర్ (Khanapur) అడవుల్లో పెద్దపులి సంచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటవీ శాఖ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న విజువల్స్ రికార్డయ్యాయి. ఈ వీడియోలో పెద్దపులి యమ దర్జాగా అడవిలో తిరుగుతుండడం స్పష్టంగా రికార్డు అయింది. దీంతో ఖానాపూర్ ఫారెస్ట్ సరిహద్దు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
పెద్దపులి సంచరిస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఎవరు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. చీకటి పడడానికి ముందే ఇళ్లకు చేరుకోవాలని ప్రజలను కోరారు. ఖానాపూర్ (Khanapur) అటవీశాఖ అధికారులు హెచ్చరికతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పెద్దపులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని భయం గుప్పిట్లో నివసిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు వీలైనంత త్వరగా పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.