Today Chicken Price: కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గేదేలే అన్నట్టుగా పైపైకి పెరుగుతుంది. కార్తీక మాసం అయినప్పటికీ.. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు చికెన్ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 220 నుంచి రూ. 280 వరకు ఉందని చికెన్ ప్రేమికులు తెలిపారు. కామారెడ్డిలో రూ. 260 ఉండగా ఉమ్మడి ఖమ్మంలో రూ. 210 నుంచి రూ. 250 వరకు ఉంది. ఏపీలోని విజయవాడలో రూ. 250, ఏలూరులో రూ.220, విశాఖలో రూ.260గా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో చికెన్ స్కిన్ లెస్ చికెన్ ధరలు తగ్గడం లేదు.
మాంసాహార ప్రియులకు షాక్: కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తి ఆరాధనలు, నదీస్నానాలు, దీపారాధనలు, తులసి వ్రతాలు వంటి ఆచారాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో మాంసాహారాన్ని పూర్తిగా దూరంగా పెట్టుకునే సంప్రదాయం ఉంది. దీంతో నాన్‌వెజ్ ప్రేమికులు ఈ నెలలో చికెన్ ధరలు దగ్గుతాయని అంచనావేస్తారు. దీని కారణంగా చికెన్ వంటి నాన్ వెజ్ పదార్థాలపై డిమాండ్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ధరలు సాధారణంగా 20-30% వరకు పడిపోతాయి. కానీ వారి అంచనాలకు పూర్తి విరుద్ధంగా చికెన్ రెట్లు అమాంతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా చికెన్ వంటి మాంస పదార్థాలపై డిమాండ్ గణనీయంగా తగ్గుతుంది, ఫలితంగా ధరలు సాధారణంగా 20-30% వరకు పడిపోతాయి. అయితే, ప్రస్తుతం చికెన్ ధరలు తగ్గకుండా భారీగా పెరిగాయి. ఇది మాంసాహార ప్రియులకు షాక్‌గా మారింది.
పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా:
- హైదరాబాద్ : 210 – 250
- వరంగల్ : 230 – 245
- కామారెడ్డి : 260
- ఉమ్మడి ఖమ్మం జిల్లా : 210 – 250
- గుంటూరు : 240 – 255
- విజయవాడ : 250
- ఏలూరు : 220
- విశాఖపట్నం : 260


