Sunday, November 16, 2025
HomeతెలంగాణNominations: నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.. త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..?

Nominations: నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.. త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..?

Jubilee Hills By-Election: జూబ్లీ‌హిల్స్​ ఉపఎన్నికకు నేడు ఈసీ నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారలు తెలిపారు. దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించారు. నేడో, రేపు బీజేపీ సైతం తమ అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా: ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకన్నప్పటికీ.. ఇంకా బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అంతే కాకుండా జూబ్లీ‌హిల్స్ నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రచారం అంతంత మాత్రమే ఉందని స్థానికులు తెలిపారు. అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఎంత ముఖ్యమో.. బీఆర్ఎస్‌కు కూడా అంతే ఉండడంతో పోరు రసవత్తరంగా సాగనుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ తహతహలాడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెట్టింది.

ముఖ్య నేతలందరూ ఇక్కడే: దీపావళి పండుగ తర్వాత అన్ని పార్టీల ప్రచారం మరింత ఊపందుకోనుందని స్థానిక ఓటర్లు తెలిపారు. మూడు పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇప్పటికే పలు సర్వేలు నిర్వహిస్తూ.. ఓటర్ల మదిలో ఏంఉందో అనే విషయాన్ని పసిగట్టే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్‌ సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బస్తీ బస్తీ తిరుగుతూ.. అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు ఏప్పటికప్పుడు.. స్థానిక నేతలతో కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గోపినాథ్​మీద ఉన్న సానుభూతితో విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గెలుపుపై రేవంత్ ధీమా: బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన.. జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే యువనేత అయిన నవీన్ కుమార్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. 20 మందికిపైగా కార్పొరేషన్ ఛైర్మన్లకు సైతం ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దీంతో కాంగ్రెస్ ఎలాగైనా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్​కార్యక్రమాన్ని సైతం పెద్ద ఎత్తున చేపట్టి కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం పార్టీ సైతం మద్దతు ప్రకటించడంతో.. తమ గెలుపు నల్లేరుపై నడకే అని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్:

  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం    : ఈ నెల 13
  • నామినేషన్ల దాఖలు చివరి రోజు    : ఈ నెల 21
  • నామినేషన్ల పరిశీలన                 : ఈ నెల 22
  • నామినేషన్ల ఉపసంహరణ           : ఈ నెల 24
  • పోలింగ్                                  : వచ్చేనెల 11
  • కౌంటింగ్                                : వచ్చేనెల 14
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad