గిరిజన ఆరాధ్య దైవాయులైన సమ్మక్క సారలమ్మ తల్లుల రాక సమీపిస్తుండడంతో పోలీసు యంత్రాంగం రాత్రి చిలకల గట్టునుండి గద్దెల ప్రాంతాల వరకు ట్రాయల్ రన్ నిర్వహించింది. గతంలో ములులో పనిచేసిన ఐపీఎస్ అధికారి కె.ఆర్ కేకన్, అదనపు ఎస్పి సదానందం ఆధ్వర్యంలో దాదాపు 500 మంది పోలీసులు అమ్మ వాళ్ళని తీసుకొస్తున్న సమయంలో భక్తులను ఎలా కట్టడి చేయాలనే విషయంలో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బలగాలు తమదైన శైలిలో నినాదాలు చేస్తూ రూప్ పార్టీలోకి ఎవరి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారుల సూచనలు పాటించారు.
ఒకేసారి 500 మంది స్పెషల్ పార్టీ పోలీసులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి నినాదాలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో భక్తులు ఆసక్తిగా తిలకించారు. బుధవారం సారలమ్మను కన్నెపల్లి నుండి, గురువారం సమ్మక్కను చిలకల గట్టు నుండి తీసుకోవస్తున్న క్రమంలో ప్రత్యేక పోలీసు బలగాలను నియమించి ఆదివాసుల మనోభావాలు దెబ్బతినకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు వివరించారు. అమ్మ వాళ్ళని తీసుకు వస్తున్న సమయంలో భక్తులు పోలీసులకు సహకరించాలని, అమ్మలు గద్దెలపై కొలువుదీరిన అనంతరం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కావాలని వారు కోరారు.