Monday, November 17, 2025
HomeతెలంగాణWarangal Municipal Employees: ఛీ..ఛీ.. వరంగల్ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగుల లిప్ లాక్ వీడియో లీక్..

Warangal Municipal Employees: ఛీ..ఛీ.. వరంగల్ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగుల లిప్ లాక్ వీడియో లీక్..

Viral Video Of Warangal Municipal Employees: అదో ప్రభుత్వ ఆఫీస్.. నిత్యం జనంతో కిటకిటలాడుతుంది. అక్కడికి ప్రజలు సమస్యలతో వస్తారు.అధికారులు వారికి పరిష్కారం చూపిస్తారు. ప్రజలు పనులు ముగించుకొని, అధికారులు విధులు ముగించుకొని, వారి వారి ఇంటికి వెళ్తారు. ఇది ఏ ప్రభుత్వ ఆఫీస్ లోనైనా రోజు వారి వృత్తి రీతిలో భాగమే అది సహజమే, కానీ… వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు తీరు నెట్టింటా విమర్శలకు వేదిక అయ్యింది. ఆ కార్యాలయంలో విధులు నిర్వహించే అధికారులు విధులు ముగిశాక కోరికల కొలనులు సేదతీరారు. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్లకుండా ఉద్యోగులిద్దరు వారి అసాంఘిక కార్యక్రమాలకి ప్రభుత్వ కార్యాలయాన్ని వేదిక చేశారు. వారు ఇద్దరు ఉన్నతమైన స్థానంలో ఉన్నాము అనేది మరిచిపోయి… ముద్దులతో హద్దులు దాటి కౌగిలింతలతో చెలరేగిపోయారు. వీరి రాసక్రీడలను ఎవరో రహస్యంగా వీడియోలో బంధించి, సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా చెక్కర్లు కొడుతూ Excuseme Officers this is not OYO to do Fun అనేలా ప్రజల నుంచి కామెంట్ల చివాట్లు వస్తున్నాయి. వరంగల్ ప్రభుత్వ కార్యాలయంలో రాసలీలలకు సంబందించిన వీడియో నెట్టిట వైరల్ అవ్వడంతో సదరు మున్సిపల్ కార్యాలయం ఉన్నత అధికారుల వరకు ఈ విషయం చేరింది. ఆ ఇద్దరు అధికారులకి కౌన్సిలింగ్ ఇచ్చి… వీరి ఇద్దరి తీరుని ఘాటుగా ప్రశ్నించారు. వారిపై తగు చర్యలు తీసుకుని ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకుంటామని ఉన్నత అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad