Friday, October 18, 2024
HomeతెలంగాణGroup-1 Exams: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షకు లైన్ క్లియర్

Group-1 Exams: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షకు లైన్ క్లియర్

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం అయింది. అయితే ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయించామని.. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అయితే కొందరు అభ్యర్థులు మాత్రం గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం విచారణ చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను సోమవారం ఉదయం కోర్టు ప్రారంభంకాగానే విచారిస్తామని చీఫ్ జస్జిస్ చంద్రచూడ్ తెలిపారు. కానీ అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

కొంతకాలంగా గ్రూప్ పరీక్షల నిర్వహణలో గందగరగోళం నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జీవో 29 రద్దుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో మెరుపు ధర్నాకు దిగిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News