TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామా ఆమోదించిన గవర్నర్ కి అధికార పక్షంతోపాటు, నిరుద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. TSPSC ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రాజీనామా చేసిన కమిషన్ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించేందుకు గవర్నర్ కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నారు.
లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు, పారదర్శక నియామకాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలో నూతన కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాల సత్వర భర్తీకి మా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ దిశగానే ముఖ్యమంత్రి చర్యలు ఇప్పటికే ప్రారంభించరని TSPSC రాష్ట్ర అధికార ప్రతినిధి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు డా. రియాజ్ తెలిపారు.
TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టాలని లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిరుద్యోగ చైతన్య బస్సుయాత్ర నాయకులు ఇంద్రనాయక్, శివానంద స్వామి ముఖ్యమంత్రిను, ప్రభుత్వ అధికారులను కోరారు.