కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, లలితా దేవి ఆర్.టి.సి. కార్యలయంలోని సిబ్బందికి కార్డియో పల్మనరీ రెసిటేషన్( సి పి ఆర్) ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిసిబ్రిలేటర్( ఏ ఈ డి) శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. ఈ శిక్షణా తరగతులు ఈనెల 02.05.2023 నుండి నిర్వహించనున్నారు. ఆర్.టి.సి. సిబ్బంది (75) మంది హాజరు అయి శిక్షణ తీసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ శిక్షణపై సంతృప్తిని వ్యక్తపరుస్తూ జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా ఈ శిక్షణను పూర్తిచేసేటట్టు చూడాలని డాక్టర్ కిరణ్ శిక్షకులు, శ్రీ. సి.హెచ్. రంగా రెడ్డి, శిక్షణ సమన్వయకర్త ను కోరారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆర్.టి.సి. డీప్యూటీ డివిజినల్ మేనేజర్ శ్రీ. భీమ్ రెడ్డి, మొదటి డిపో మేనేజర్ శ్రీ. ప్రణీత్, రెండవ డిపో మేనేజర్ మల్లయ్య, డా. సుజాత, పీ.ఓ., యన్.సి.డి., డాక్టర్ కె. లలితా దేవి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు కొనసాగుతుందని తెలియజేశారు.