ప్రజా ఆశీర్వాదయాత్రలో భాగంగా చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య మొయినాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మొయినాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మైనారిటీ నాయకులు, మొయినాబాద్ కు చెందిన సురేష్ యాదవ్ తన అనుచర వర్గం యువజన నాయకులు పట్టణ చౌరస్తాలో ర్యాలీగా వచ్చి కాలే యాదయ్య సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాలే యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనారిటీల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. ముస్లిం పండుగలను అధికారికంగా జరుపిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణేనని అన్నారు. తెలంగాణ రాక ముందు గ్రామాలలో, పట్టణాలలో బిందెడు మంచినీళ్ల కోసం పానీపట్టు యుద్దాలే జరిగేవని, నేడు కేసీఆర్ పాలనలో ఇంటింటికీ మిషన్ భగీరథ మంచినీటి సరఫరా అవుతోందని కాలే యాదయ్య అన్నారు. బీఆర్ఎస్ పాలన నచ్చి మరోసారి కేసీఆర్ కు పట్టం కట్టేందుకు యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేరుతున్నారని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న వైస్ ఎంపీపీ ఎం మమత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్ యాదవ్, బాల్ రాజ్, ప్రధానకార్యదర్శి నర్సింహ్మగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంపి రవూప్, వైస్ చైర్మన్లు దారెడ్డి వెంకట్రెడ్డి, డప్పు రాజు, సర్పంచ్లు మనోజ్ కుమార్, శ్రీనివాస్, ఎంపీటీసీలు బట్టు మల్లేష్, అర్జున్, మాజీ సర్పంచ్ గీతా వనజాక్షి, మాజీ వైస్ ఎంపీపీ జేఎన్ రాజు, సీనియర్ నాకకులు రవియాదవ్, గణేష్ రెడ్డి, విష్ణువర్దన్ గౌడ్, రాంరెడ్డి, అంజయ్యగౌడ్, దర్గ రాజు, నాగరాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.