Amit sha visit to Hyderabad: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడినట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వర్గాలు తెలిపాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 6న అమిత్ షా భాగ్యనగర్‌కు రావాల్సి ఉంది. గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గణేష్ నిమజ్జనంలో ఆయన పాల్గొనాల్సి ఉంది.
- Advertisement -
అయితే, కొన్ని అత్యవసర కార్యక్రమాల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో అమిత్ షా సమావేశం కావాల్సిన అవసరం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో జరిగిన ఈ మార్పు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నిరాశ కలిగించింది.


