Thursday, September 19, 2024
HomeతెలంగాణUPF: కవితపై వ్యక్తిగత విమర్శలా

UPF: కవితపై వ్యక్తిగత విమర్శలా

విగ్రహం ఏర్పాటు చేస్తారా? లేదా?

అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అని చెప్పకుండా విమర్శలు చేయడం తగదని తేల్చిచెప్పారు. ఇలానే విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలె ఫ్రాంట్ నాయకులు ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రెంట్ రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్,బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డా. ఎల్చల దత్తాత్రేయ,బోల్ల శివ శంకర్ పద్మశాలి సంఘం జాతీయ నాయకులు,గౌతమ్ ప్రసాద్,కోలా శ్రీనివాస్ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆలకుంట్ల హరి యుపిఎఫ్ నగర అధ్యక్షులు, దోగుంట్ల నరేష్ ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ జేఏసీ నాయకులు మన అశోక్ యాదవ్, చింత మహేష్ కుమార్, అర్జున్ అనిల్ ప్రజాపతి పెద్ద సంఖ్యలో బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ… మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసంతో పాటు బీసీల హక్కల సాధనకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ స్పీకర్ ను కలిసి వినతి పత్రం అందించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఉద్యమిస్తే అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ప్రస్తావించారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఈ నెల రెండో వారంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 11లోగా అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అల్టిమేటం జారీ చేశారు.

బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఏల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ…. ఎమ్మెల్సీ కవిత ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చారని, అందులో భాగంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపడుతున్నామని వివరించారు. పూలే బీసీలకే కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడని, బీసీ కులాలు దేవుడిగా భావించే పూలే విగ్రహన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పూలే అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకుపుడుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితపై అవాకులు చెవాకులు పేలడం, వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శించడం సరికాదని సూచించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఖబడ్దార్ అని హెచ్చరించారు. వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవ విషయమైన పూలేను వీధిపాలు చేస్తున్నారని మంత్రులపై మండిపడ్డారు. పూలే విగ్రహం ఏర్పాటు అంశాన్ని చులకన చేస్తున్నారని ఆరోపించారు. పదవి రాకముందు ఒక రాకముందు ఒకరకంగా పదవి వచ్చిన తర్వాత మరోరకంగా పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, విగ్రహం ఏర్పాటు కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి గౌరవంగా ఆహ్వానిస్తే…. పదవి ఆశతో స్థాయిని దిగజార్చుకొని ఆయన మాట్లాడారని విమర్శించారు.

ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్… దేశంలో విద్యా వ్యాప్తి కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నది తమ డిమాండ్ అని, ఆ డిమాండ్ సహేతుకమా కాదా అన్నదానిపై సీఎం, మంత్రులు మాట్లాడాలి కానీ ఎమ్మెల్సీ కవితను నిందించడం సరికాదని సూచించారు. సీఎం వద్ద ఇబ్బందులు వస్తాయని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎంను ప్రశ్నించే ధైర్యం లేదుకానీ డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ కవితను విమర్శించడం సబబు కాదని స్పష్టం చేశారు. జ్యోతిరావు పూలే ఆశయాల పట్ల చిత్తశుద్ధి ఉంటే విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎంకు మంత్రులు విజ్ఞప్తి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News