Saturday, September 28, 2024
HomeతెలంగాణVaddiraju: వద్దిరాజుకు బొత్స, రాంచరణ్ శుభాకాంక్షలు

Vaddiraju: వద్దిరాజుకు బొత్స, రాంచరణ్ శుభాకాంక్షలు

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక

రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రముఖ సినీ హీరో రాంచరణ్, లోకసభ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రముఖ వ్యాపారవేత్త కుందవరపు శ్రీనివాస్ నాయుడి కూతురి పెళ్లికి హాజరైన సందర్భంగా వారితో పాటు మరికొందరు నాయకులు, ప్రముఖులు ఎంపీ రవిచంద్రకు తమ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

అదేవిధంగా మియాపూర్ లో మరొక పెళ్లిలో ఖమ్మంకు చెందిన పలువురు ఎంపీ వద్దిరాజుతో ఫోటోలు దిగి శుభాభినందనలు చెప్పారు. అంతకుముందు ఆదివారం ఉదయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసానికి వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజికవేత్త ఖాశెట్టి కుమార్, ప్రముఖ విద్యావేత్త లక్కినేని ప్రసాద్, సినీ ప్రముఖులు మల్లం రమేష్, మున్నూరుకాపు ప్రముఖులు వేల్పుల శ్రీనివాస్, బొల్లం లక్ష్మణ్, రంగస్థల నటుడు చల్లగాలి వెంకటరాజు, వ్యాపారవేత్తలు సుమీర్ జైన్, పీ.హనుమంతరావు, టీ.రాజకుమార్, కౌశిక్ కేటరర్స్ అధినేత ఆలపాటి లక్ష్మీనారాయణ తదితరులు ఎంపీ వద్దిరాజును కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News