Sunday, October 6, 2024
HomeతెలంగాణValigonda: స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్మెంట్ కోసం కలెక్టరేట్ ముట్టడి

Valigonda: స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్మెంట్ కోసం కలెక్టరేట్ ముట్టడి

పెండింగ్ లో ఉన్న 5,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు భువనగిరి బస్ స్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులతోభారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడించారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ, ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ , మెస్ చార్జీలు పెంచాలన్నారు. విద్యార్థులు కొట్లాడి, అమరులై తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యార్థులే బిచ్చం ఎత్తుకునేలా చేసింది కేసీఆర్ సర్కారు అంటూ వీరు మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు లక్షల కోట్లు ఉంటాయి కానీ విద్యార్థుల కష్టాలు తీర్చడానికి బడ్జెట్ లేదని చేతులు చేతులు ఎలా దులుపుకుంటారని వీరు సర్కారును నిలదీస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ 3,000 నుండి 20వేలకు పెంచాలి,హాస్టల్ లో మెస్ ఛార్జీలు 1500 నుండి 3000 చేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News