పద్మశ్రీ వనజీవి రామయ్య, జిల్లా కలెక్టర్ ను ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో కలిసి, సుమారు 20 కిలోల వేప విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేప చెట్ల ఆవశ్యకత ఎంతో ఉందని, ఆయుర్వేదంలో వేప ఎంతో ఉపయోగమని అన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య తన పెన్షన్ పెంపు, గృహాలక్ష్మి పథక లబ్ది, మోపెడ్ ఇప్పించగలరని కలెక్టర్ ను కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు పరిశీలించి, తగుచర్యలకై ఆదేశించారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డీఆర్డీఓ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.