Sunday, July 7, 2024
HomeతెలంగాణVanaparthi: మేఘరెడ్డి గెలుపు కోసం యువకుడి పాదయాత్ర

Vanaparthi: మేఘరెడ్డి గెలుపు కోసం యువకుడి పాదయాత్ర

పాదయాత్రను ప్రారంభించిన తూడి మేఘ రెడ్డి

వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘా రెడ్డి గెలుపు కోసం పెబ్బేరు మండల కేంద్రం నుంచి అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వరకు చెలిమిళ్ళ గ్రామానికి చెందిన గోవింద్ అనే యువకుడు గురువారం పాదయాత్రగా బయలుదేరాడు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ఘన విజయం సాధించాలని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేస్తున్నట్లు యువకుడు తెలిపారు. ఈ సందర్భంగా మెగా రెడ్డి యువకుడి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. తన గెలుపు కోసం పాదయాత్ర చేసే యువకుడికి తాను ఎల్లప్పుడూ అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News