Monday, April 7, 2025
HomeతెలంగాణVanaparthi: ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

Vanaparthi: ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండా ప్రశాంత్ రెడ్డి

ప్రజలు ఆదరిస్తే అభివృద్ధి చేస్తానని దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండా ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకుడు కొండ ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఒక్కసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు.

- Advertisement -


వందలాదిమంది కార్యకర్తలు, వేలాది మంది ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర నాయకులు డోకూర్ ఎంపీటీసీ యజ్ఞ భూపాల్ రెడ్డి, కుర్వ రమేష్, బాలమణెమ్మ, దేవన్న సాగర్, నారాయణ రెడ్డి, నంబీ రాజు, రాజగోపాల్ రెడ్డి, ఫరూక్, గూటం శ్రీను, మండల అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News