సాగు, తాగు నీళ్లు తెలంగాణ ఘనవిజయం పని రాష్ట్ర విశేషాలు శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.ఖిల్లాఘణపురం మండలం గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాబోయే వందేళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని,పునర్నిర్మాణం కోసమే తెలంగాణ తెచ్చుకున్నమనీ అన్నారు. 60,70 ఏళ్లలో ఎదుర్కొన్న అవస్థలు తొలగించే వ్యవస్థ కోసం పునర్నిర్మాణం చేపట్టమని, ప్రజల ప్రధానమైన సమస్యలను తీర్చుకుంటూ వచ్చామని, ఒకప్పుడు తాగునీళ్ల కోసం బోర్లు, బావులు, బోరింగుల చుట్టూ తిరిగిన దుస్థితి .. ఆ సమస్యను పూర్తిగా రూపుమాపమని అన్నారు.
నీటి కోసం పడ్డ కష్టాలను రూపుమాపడానికి ఇంటింటికి నల్లా నీళ్లు తెచ్చామని, దీక్షగా పనిచేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీటి కష్టాలను తీర్చడం జరిగిందన్నారు. కాల్వలు లైనింగ్ చేసి సాగునీటి వ్యవస్థను ఆధునికరిస్తున్నామని అన్నారు.పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజల కళ్ల ముందున్నదనీ,నాయకులు 41 రోజులు బీఆర్ఎస్ మండల దీక్షలా పనిచేయాలనీ పిలుపునిచ్చారు.పూర్తి సమయం కేటాయించి పనిచేసి గెలుపు కోసం కృషిచేయాలి .. కార్యకర్తలు స్వంత పనులు చూసుకుంటూ వీలున్నప్పుడు పార్టీకి సమయం ఇవ్వాలని కోరారు.భగవంతుడి ఆశీస్సులు తీసుకున్నాం .. ప్రజల ఆశీస్సుల కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.