నేనున్నాను అదైర్యాపడకండి అని హామీ ఇచ్చారు కేటీఆర్. వీర్నపల్లి మండలంలో గత పదిరోజులుగా కురుస్తన్న అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన మండల రైతులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. వీర్నపల్లి మండల జెడ్పిటిసి గుగులోతు కళావతి సురేష్ నాయక్, ఎంపిపి భూల,మండల అధ్యక్షులు గుజ్జల రాజిరెడ్డి,సర్పంచ్ పాటి దినకర్, మండల సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం,వీర్నపల్లి ఉపసర్పంచ్ బోయిని రవిల మండల నాయకుల అభ్యర్తన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో కలసి మంత్రి కేటీఆర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మండలంలో పదిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో నేరుగా కలసి మాట్లాడారు ఈ సందర్బంగా ఐటి పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ అనుకోకుండా ప్రకృతి వైపారీత్యాల వాళ్ళ పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వర్షాలు తగ్గగానే ఉన్నటువంటి పంటను కోసు కోవాలని పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని కొనుగోలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యన్ని సైతం ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొంటుందని అన్నారు కార్యక్రమం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు సురేష్ నాయక్, ఎంపిటిసి ల ఫోరం మండల అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్,సర్పంచ్ ఎడ్ల లక్ష్మి రాజాం, రంగంపేట సర్పంచ్ నందగిరి లింగం,రఫీ,బానోత్ విట్టల్ నాయక్, కంటం నాగరాజు, గంగాధరి రాజు, గుగులోతు రమేష్ నాయక్, శ్రీరాం నాయక్,మండల మహిళ విభాగం అధ్యక్షురాలు గుగులోతు కళ తిరుపతి నాయక్,వ్యవసాయ, రెవెన్యూ అధికారులు మండల సర్పంచ్ లు సీనియర్ నాయకులు, రైతులు ఉన్నారు.