Saturday, November 23, 2024
HomeతెలంగాణVemula: కాంగ్రెస్ కు ఓటేస్తే రోజుకు 3 గంటలే కరెంట్

Vemula: కాంగ్రెస్ కు ఓటేస్తే రోజుకు 3 గంటలే కరెంట్

కాంగ్రెస్, బీజేపీని బంగాళాఖాతంలో పాతేయాలి

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు…

- Advertisement -

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:

ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వేముల నిప్పులు చెరిగారు. 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్న రేవంత్.. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3గంటల కరెంట్ వస్తుందని తేల్చేశారన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ పాతరోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వేముల పిలుపునిచ్చారు. బీజేపీ మోటార్లు కు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని, కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయేవారన్నారు. కాంగ్రెస్, బీజేపీని బంగాళాఖాతంలో పాతేయాలన్న మంత్రి, కాంగ్రెస్ దళారుల కోసం, బీజేపీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.

రైతులు రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి చెంప చెళ్లమనిపించే విధంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తున్నా. రైతులతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News