Sunday, November 16, 2025
HomeతెలంగాణVemulapalli: నేను నిద్రపోను.. అధికారులను నిద్రపోనివ్వను

Vemulapalli: నేను నిద్రపోను.. అధికారులను నిద్రపోనివ్వను

ప్రజల కోసం..

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిద్రపోను అధికారులను నిద్రపోనివ్వనని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

- Advertisement -

వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజా సమస్యలపై సమన్వయంతో పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీ కోసం అహర్నిశల కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు భాగ్యస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శారదా దేవి, తహసిల్దార్ సాధత్, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, ఉపాధ్యా యుల ఉపాధ్యాక్షుడు రావు ఎల్లారెడ్డి , టి పి సి సి మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడ బోయిన అర్జున్, మండల పార్టీ అధ్యక్షుడు మాలికాంతారెడ్డి, గడ్డం వేణుగోపాల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గడ్డం స్ప్రుధర్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, పుట్టల పెద్ద వెంకన్న నాయకులు పుట్టల శ్రీనివాస్, నాగవెల్లి మధు, గంజి శ్రీనివాస్, బూసి రెడ్డి వెంకటరెడ్డి ,పల్లా వెంకటయ్య, పిల్లల సందీప్ బీరెల్లి సతీష్ రెడ్డి, నగేష్, వినోద్, గిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad