సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ (Suvarnabhoomi infra developers) బాధితులు ఆ సంస్థ ఎండీపై సీసీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట తమని మోసం చేశారని బాధ్యతలు ఫిర్యాదు చేశారు. బయ్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.కోటి రూపాయల వరకు వసూలు చేశారని తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది సాఫ్ట్వేర్, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు.
సంస్థ ఎండి శ్రీధర్ తమకు మాయ మాటలు చెప్పి మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పై 25% ఎక్కువ చెల్లిస్తామని చెప్పారన్నారు. స్కీం కాలు పరిమితి దాటినా డబ్బులు చెల్లించకుండా తన ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీపై కేసు నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్ పై తగిన చర్యలు తీసుకుని తమ డబ్బు తిరిగి వచ్చేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.