డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సెప్టెంబర్ 5 ను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా టీచర్స్ డేని ఘనంగా జరుపుకున్నారు. ఇదే సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 48 మంది ప్రభుత్వ, 16 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసి వారిని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గోపి, విద్యాశాఖ అధికారి జనార్ధన్ రావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ విచ్చేసి అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ ను ముఖ్య అతిథులు మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా మెమొంటో, ప్రశంసా పత్రం అందజేసి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కలెక్టర్, డిఇఓ, ట్రస్మా ప్రెసిడెంట్ యాదగిరి శేఖర్ రావు, ఎంఈఓ నర్సింహా రెడ్డి, ట్రస్మా హుజూరాబాద్ మండల ప్రెసిడెంట్ బద్ధుల రాజకుమార్ లు హాజరై అభినందించారు. ఈ అవార్డ్ రావడం పట్ల విజ్ఞాన్ స్కూల్ డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు.