Friday, November 22, 2024
HomeతెలంగాణVinod: సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ గెలుపు మంత్రం

Vinod: సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ గెలుపు మంత్రం

రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట) ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్ కుమార్,తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మకుండా ప్రజలు ఆలోచించి తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగరవేయాలని కోరారు. మా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే బిఆర్ఎస్ ను గెలిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు,ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణ రెడ్డి,సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News