రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్ణపల్లి మండలం ఉమ్మడి గర్జనపల్లి జవహర్ లాల్ నాయక్ తండా గ్రామానికి చెందిన అజ్మీరా నవీన్ నాయక్ ఏడు రోజుల క్రితం గ్రామం నుండి వీర్ణపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వీర్ణపల్లి గ్రామ ఉపసర్పంచ్ బోయిని రవి చేతి ఖర్చులకు ఆర్థిక సాయం చేసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత పాదయాత్ర ప్రారంభించగా ప్రగతి భవన్ కు ఏడు రోజుల్లో చేరి ప్రగతి భవన్లో కే తారకరామారావును కలిసినట్లు తెలియజేశారు. ఈ సందర్బంగా పాదయాత్ర అనంతరం మంత్రి కేటీఆర్ యువకుడితో పాదయాత్ర ఎందుకు చేశావు అని నవ్వుతూ పలకరించినట్లు తెలిపారు. మూడోవసారి కేసీఆర్ ముఖ్య మంత్రి కావాలని మూడోవసారి కూడా బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వీర్ణపల్లి మండలంలో ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ కే ఓటు వేసి మిమ్ములను భారీ మెజార్టీతో ప్రజలు గెలిస్తారని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమలు చూసి మళ్ళీ బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేస్తారని మంత్రి కేటీఆర్ తో మాట్లాడినట్టు నవీన్ నాయక్ తెలియజేశారు.