Sunday, July 7, 2024
HomeతెలంగాణVruksha Prasadam: కొత్తకొండ జాతర భక్తులకు వృక్ష ప్రసాదం

Vruksha Prasadam: కొత్తకొండ జాతర భక్తులకు వృక్ష ప్రసాదం

స్వయాన వీరభద్ర స్వామి ఇంట్లో కొలువైనట్టే

కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు గత ఏడు సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం 25 వేల నుండి ముప్పై వేల వరకు పండ్ల మొక్కలను వృక్ష ప్రసాదం పేరిట అందిస్తున్నట్లు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వృక్ష ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేంద్ర మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా జెఎస్ఆర్ ఆధ్వర్యంలో వృక్ష ప్రసాదం భక్తులకు అందించడం ఎంతో సంతోషకరమని జెఎస్ఆర్ అభినందించారు. జన్నపురెడ్డి సురేందర్ మాట్లాడుతూ… వృక్ష ప్రసాదం ముఖ్య ఉద్దేశ్యం వీరభద్ర స్వామి జాతరకు వచ్చిన భక్తులు వృక్ష ప్రసాదం తీసుకెళ్తే ఆ చెట్టు వీరభద్రస్వామి సన్నిధిలో తీసుకు వచ్చారు కాబట్టి స్వయాన వీరభద్ర స్వామి ఇంట్లో కొలువైనాడు అనే భావన, ధైర్యంతో ఉంటాన్నారు. ఇంటి ముందు ఆ చెట్టు పెట్టుకుంటే వీరభద్ర స్వామి వారి ఇంటి ముందు ఉన్నట్టు, రానున్న రోజుల్లో మొక్క పెరిగి వృక్షం అవుతుంది కాబట్టే వృక్ష ప్రసాదం అనే పేరు పెట్టడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆక్సిజన్ రూపంలో తర్వాత నీడ రూపంలో, పండ్ల రూపంలో ఇంట్లో వారికి ఉపయోగపడుతుంది. ప్రతి దేవాలయంలో కూడా వృక్ష ప్రసాదాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు.

- Advertisement -

గత ప్రభుత్వంలో ఉన్న కొందరు ముల్కనూర్ నాయకులు తప్పుదోవ పట్టించడం వల్ల అన్ని అర్హతలు ఉన్న కొత్తకొండ మండలం ఏర్పాటు కాలేదు అన్నారు. ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్న గ్రామాలు అన్ని మండలాలుగా ఉన్నా.. కొత్తకొండ మండలం గా లేదు అనీ గుర్తు చేశారు. బిజెపి అధికారంలో రాగానే కొత్తకొండ మండలం గా ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్తకొండ మండలం ఏర్పడే వరకు వృక్ష ప్రసాదం అందజేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News